Home / Government Schemes / PM Kisan Scheme Extended: రైతులకు ఏటా రూ.6,000 కొనసాగింపు.. 2030-31 వరకు పథకం పొడిగింపు..

PM Kisan Scheme Extended: రైతులకు ఏటా రూ.6,000 కొనసాగింపు.. 2030-31 వరకు పథకం పొడిగింపు..

PM Kisan Scheme Extended 2026

న్యూఢిల్లీ: దేశంలోని కోట్లాది మంది రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం మల్లొకసారి ఎగిరి గంతేసి శుభవార్తను అందించింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకాన్ని మరో ఐదు సంవత్సరాల పాటు కొనసాగింపు (Extended) చేయవలసిందిగా కేంద్ర ప్రభుత్వ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. 2026-27 నుంచి 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు ఈ ప్రధానమంత్రి కిసాన్ పథకం అమల్లో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ ఇందుకోసం రూ.3,15,614 కోట్ల భారీ వ్యయానికి ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం ద్వారా అర్హత కలిగిన రైతు కుటుంబాలకు ప్రతి సంవత్సరం లాగానే ఏటా రూ.6,000 ఆర్థిక సాయం కొనసాగింపు జరుగుతుంది. ఈ మొత్తాన్ని పెంచుతారనే అంచనాలు ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఉన్న సాయాన్నే యథాతథంగా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఐదేళ్లకు భారీ నిధుల కేటాయింపు..

పీఎం కిసాన్ పథకం నిరంతరాయంగా కొనసాగింపు జరిగేందుకు వచ్చే ఐదేళ్ల కాలానికి రూ.3.15 లక్షల కోట్లకు పైగా నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి స్థిరమైన పూర్తి మద్దతు అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

ఈ పథకం కింద అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ప్రతి సంవత్సరం లాగానే రూ.6,000 చొప్పున ఆర్థిక సాయం అందుతుంది. ఈ మొత్తాన్ని మూడు సమాన విడతల్లో రైతుల బ్యాంక్ ఖాతాలకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ద్వారా జమ చేస్తారు. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ.2,000 చొప్పున లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది.

పీఎం కిసాన్ పథకం ఎందుకు?

వ్యవసాయ కార్యకలాపాలకు అవసరమైన కనీస పెట్టుబడి వ్యయానికి రైతులకు కొంత ఆర్థిక చేయూత అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2019లో పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించింది. భూస్వామ్య రైతు కుటుంబాలకు నేరుగా నగదు బదిలీ చేయడం ద్వారా మధ్యవర్తుల జోక్యం లేకుండా పారదర్శకంగా సాయం అందించడం ఈ పథకం ప్రధాన ప్రత్యేకత.

పథకం ముఖ్య వివరాలు..

అంశంవివరాలు
పథకంPM-KISAN (ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి)
పొడిగింపు కాలం2026-27 నుంచి 2030-31 వరకు
మొత్తం వ్యయంరూ.3,15,614 కోట్లు
వార్షిక సాయంరూ.6,000
విడతలుఏడాదికి 3
ఒక్కో విడతరూ.2,000
చెల్లింపు విధానంDBT ద్వారా నేరుగా బ్యాంక్ ఖాతాలో

సాయం పెంపుపై రైతుల ఆశలు

2019లో ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి రైతులకు అందుతున్న వార్షిక సాయం రూ.6,000గానే ఉంది. ఇదే సమయంలో ఎరువులు, విత్తనాలు, డీజిల్, కూలీల ఖర్చులు గణనీయంగా పెరగడంతో సాయం మొత్తాన్ని పెంచాలని రైతు సంఘాలు చాలాకాలంగా కోరుతున్నాయి. అయితే తాజా క్యాబినెట్ నిర్ణయంలో సాయం మొత్తంలో ఎలాంటి మార్పు చేయలేదు. దీంతో ప్రస్తుతం అమల్లో ఉన్న విధానమే కొనసాగనుంది.

భవిష్యత్తులో పెంపుపై ఏముంది?

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం సాయం పెంపుపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే వ్యవసాయ వ్యయాలు పెరుగుతున్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో కేంద్ర బడ్జెట్‌లు లేదా ఇతర విధాన నిర్ణయాల సమయంలో ఈ అంశాన్ని పరిశీలించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే స్పష్టత రానుంది.

అధికారిక సమాచారం

  • PM-KISAN అధికారిక పోర్టల్: https://pmkisan.gov.in
  • భారత ప్రభుత్వం – వ్యవసాయ & రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ
  • కేంద్ర క్యాబినెట్ అధికారిక నిర్ణయాలు / PIB విడుదలలు

ఇది కూడా చదవండి: Indiramma Towers: ఆగస్టు 10తో దరఖాస్తులకు ముగింపు.. ఇందిరమ్మ టవర్స్‌పై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

పీఎం కిసాన్ పథకాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగించడం అర్హులైన రైతులకు ఊరటనిచ్చే నిర్ణయంగా చెప్పొచ్చు. అయితే వార్షిక సాయం రూ.6,000లో ఎలాంటి మార్పు చేయకపోవడం రైతు సంఘాల్లో నిరాశ కలిగించింది. భవిష్యత్తులో సాయం పెంపుపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. తాజా అప్‌డేట్ల కోసం రైతులు అధికారిక PM-KISAN పోర్టల్‌ను ఎప్పటికప్పుడు పరిశీలించడం మంచిది.

Tagged:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *